పారిస్ ఒలింపిక్స్ 2024లో పూల్ బీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడానికి పురుషుల హాకీ జట్టు ఐర్లాండ్‌పై భారత్ 2-0 తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2 విజయం సాధించారు. అనంతరం అర్జెంటీనాతో జరిగిన తమ రెండో మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించారు. ఐర్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్‌లను ఒకసారి పెనాల్టీ స్ట్రోక్ నుంచి తర్వాత పెనాల్టీ కార్నర్ నుంచి సాధించాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటడంతో ఆస్ట్రేలియా, బెల్జియంలను వెనక్కి నెట్టి పూల్-బిలో భారత్ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. తొలుత 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీని తర్వాత అర్జెంటీనాతో భారత్ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఇప్పుడు టీం ఇండియా 2-0తో ఐర్లాండ్‌ను ఓడించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను ఆగస్టు 1న బెల్జియంతో ఆడనుంది. ఇది భారత్‌కు కీలక మ్యాచ్‌గా మారనుంది. చూడాలి ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారో..