పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ స్విప్నిల్ కుశల్ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఈవెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 పాయింట్లు సాధించిన ఆ షూటర్ ఏడవ స్థానంలో నిలిచాడు. ఎక్కువ సంఖ్యలో పది పాయింట్లు కొట్టిన నేపథ్యంలో స్వప్నిల్‌కు ఫైనల్ అర్హత కలిగింది. ఇదే ఈవెంట్‌లో పోటీపడ్డ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఫైనల్ స్టాండింగ్‌లో ఐశ్వర్యకు కేవలం 98 పాయింట్లు మాత్రమే వచ్చాయి.
ఫైనల్ కి చేరుకున్న స్వప్నిల్ మాట్లాడుతూ క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ నుంచి ప్రేరణ పొందానని, తాను కూడా ధోని లాగానే కెరీర్ ప్రారంభంలో రైల్వే టిక్కెట్ కలెక్టర్ గా పనిచేసినట్లు తెలిపారు. “షూటింగ్‌లో నేను ఏ వ్యక్తిని అనుసరించను. కానీ ఎంఎస్ ధోని అంటే నాకు చాలా గౌరవం. అతను మైదానంలో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. అది నాకు నచ్చుతుంది. నేను కూడా ధోనిలాగే టిక్కెట్ కలెక్టర్‌ని కాబట్టి.. ఆయన కథతో నేను కనెక్ట్ అయ్యాను. ప్రపంచకప్ విజేత ధోని బయోపిక్‌ను చాలాసార్లు చూశాను. అతను ఛాంపియన్ క్రికెటర్‌గా పెద్ద విజయాలు సాధించగలడు.” అని స్వప్నిల్ పేర్కొన్నాడు.