పారిస్ ఒలింపిక్స్ 2024 భారత ఆటగాళ్లు మరిచిపోరు.. ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. గెలుస్తామని భావించిన ఆటగాళ్లపై వేటు వేసింది. మరికొందరు అనూహ్య పరిణామాలతో వెనుదిగిరారు. ఏళ్ల తరబడి తాము కష్టపడిన కష్టమంతా పోయిందని మరికొందరి ఆవేదన. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. బుధవారం రాత్రి జరిగిన 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను కాంస్య పతకం కోల్పోయింది. కేవల ఒక్క కేజీతో పతకానికి దూరంగా నిలిచిం ది. మణిపూర్‌కి చెందిన మీరాబాయి మొత్తం 199 కేజీలు ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 88 కేజీలెత్తిన చాను, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కిలోలు బరువు ఎత్తింది. టోటల్‌గా 199 కేజీలు ఎత్తింది మీరాబాయి. ఇదే పోటీలో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ హౌజిహుయి 206 కేజీలు ఎత్తి బంగారు పతకాన్ని దక్కించుకుంది. రొమేనియా వెయిట్ లిఫ్టర్ మిహేలా వాలైంటీనా 205 కేజీలు, థాయ్‌లాండ్‌కు చెందిన సురోచనా 200 కేజీలు ఎత్తి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.