చింత చిగురు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. దానిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
పైల్స్ ఉన్న వారికి కూడా బాగానే పనిచేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కడుపులో నులి పురుగులు సమస్యలు కూడా తొలగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.