ఏడిస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కన్నీళ్ల వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే సహజమైన నొప్పులను తగ్గిస్తుంది.
మనసుపై భారం, ఒత్తిడి పెరిగకుండా సహాయపడుతుంది. ఏడవటం వల్ల భావోద్వేగాల విడుదల జరుగుతుంది. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపోగలుగుతారు. అయితే ప్రతిరోజూ ఏడవాల్సిన అవసరం లేదు. దృష్టి కూడా మెరుగవుతుంది.