అక్టోబర్ 3వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే శని దేవుడు ఇదే నెల 15వ తేదీన ధనిష్ట నక్షత్రంలోకిి ప్రవేశించనున్నాడు.ఇక దీనికి తోడు బృహస్పతి వృషభ రాశిలో 12 సంవత్సరాల తర్వాత తిరోగమనం చేందనున్నాడు. అంతేకాక దీనిలో ప్రధానమైన గ్రహాల సంచారం కూడా ఉంటుంది. ఇక ఈ పరిణామాలన్నీ కూడా కొన్ని రాశుల వారికి తిరుగులేని అదృష్టాన్ని ప్రసాదించనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పరిణామాల వలన ఏ రాశి వారు ఎలాంటి ప్రయోజనాలు పొందగలుగుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Durga Navaratri ధనుస్సు
అక్టోబర్ లో ఏర్పడనున్న పరిణామాల వలన ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విజయాలు సాధిస్తారు.వృషభ రాశిలో గురువు తిరుగమనంలో ఉండటం వలన వీరికి అనేక రకాల ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆర్థికంగా బలపడతారు.కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
Durga Navaratri వృషభ రాశి
బృహస్పతి హీరోగమనం వలన వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో అధిక రాబడులు సాధిస్తారు. అలాగే వారి వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిధున రాశి…
బృహస్పతి తీరోగమనం కారణంగా మిధున రాశి వారు కోటీశ్వరులు అవుతారు. అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కొత్త ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి అవకాశాలు లభిస్తాయి. విదేశీ యోగం ఉంది. గతంలో నిలిచిపోయిన పనులను ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు.