నివేదికల ప్రకారం.. ఆగస్టు 2024 నాటికి టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్ 400 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.35 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీకి చెందిన 29 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. గ్రూప్‌లో అతిపెద్ద కంపెనీ టాటా కన్సల్టెన్సీ. 9 అక్టోబర్ 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,38,519.36 కోట్లుగా నమోదైంది. మార్కెట్ క్యాప్ పరంగా TCS దేశంలో రెండవ అతిపెద్ద IT కంపెనీ.