జొన్న రొట్టెలను ఈ మధ్య కాలంలో ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఈ రోటీలను రోజూ తినడం వల్ల శరీరానికి చాలా మేలు. పలు ఆరోగ్యకరమైన పోషకాలు అన్నీ అందుతాయి.శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ జొన్న రొట్టెలో మనకు లభిస్తాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధ పడేవారికి ఈ రోటీలు బెస్ట్. ఇందులో అధిక మోతాదులో ఫైబర్, ప్రోటీన్ లభిస్తాయి. అంతే కాకుండా విటమిన్ బి కాంప్లెక్ట్స్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి అధిక పరిమాణంలో ఉంటాయి. ఇన్ని లాభాలు ఉన్న ఈ రొట్టెను తింటే ఎలాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు:
జొన్నె రొట్టెలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఈ చపాతీలను మీ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. కాబట్టి తక్కువగా తీసుకున్నా కడుపు నిండుతుంది. జీవక్రియను మెరుగు పరుస్తుంది.
షుగర్ వ్యాధి రాదు:
జొన్న రోటీలను తింటే షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. ఎందుకంటే జొన్న చపాతీలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరగవు. అలాగే డయాబెటీస్‌తో బాధ పడేవారు కూడా ఈ రొట్టెలను తింటే షుగర్ పెరగకుండా కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి అనుకునేవారు ప్రతిరోజూ సాయంత్రం తినడం మంచిది.
గుండె సమస్యలు దూరం:
జొన్న చపాతీల్లో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి. అదే విధంగా రక్త పోటు పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
బలంగా ఎముకలు:
జొన్న రొట్టెల్లో క్యాల్షియం, ఫాస్పరస్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను, దంతాలను బలంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. అలాగే అన్ని రకాల ఎముకల సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయ పడుతుంది.
చర్మ ఆరోగ్యం:
జొన్నల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాలను ఆఱోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై ఉండే మలినాలు, మృత కణాలను తొలగించి.. చర్మం కాంతివంతంగా.. సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది.