ప్రతి రోజూ బాదం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే చాలా మంది బాదంను పొట్టు తీసేసి తింటుంటారు. కానీ బాదం పొట్టులో కూడా మంచి గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్, ఫ్లేవనాయిడ్లు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇవి కడుపును శుభ్రం చేస్తాయి. దీంతో అజీర్తి, గ్యాంస్ వంటి సమస్యలు దరి చేరవు. జుట్టు ధృడత్వానికి తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.