శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం అంటారు. దీనిని ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ (జ్వరమాపకం) ద్వారా కొలిచి గుర్తిస్తారు.మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.దీంతో వెంటనే బాడీ టెంపరేచర్ పెరుగుతోంది. ఆ వెంటనే మనం డాక్టర్ని సంపద్రిస్తుంటాం. అయితే సాధారణంగా జ్వరం వస్తుందేమో అని ముందస్తు జాగ్రత్తగా, Dolo 650, paracetamol వంటి ట్యాబ్‌లెట్స్‌ను మన దగ్గర పెట్టుకుంటాం.జ్వరం వస్తే మన దేశంలో Dolo 650, paracetamol మందులనే ఎక్కువగా వినియోగిస్తుంటారు . డోలో 650 చాలా మందికి సుపరిచితమైన నొప్పి నివారిణి. ఇది పారాసెటమాల్ అనే రసాయనం నుండి తయారవుతుంది. ఇది తలనొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి వివిధ రకాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు.అయితే వీటి వల్ల లాభాలతో పాటు, నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఓసారి పరిశీలిస్తే..డోలో 650 యొక్క ఉపయోగాలు:తలనొప్పి, దంత నొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నెలసరి నొప్పులు వంటి వివిధ రకాల నొప్పులను తగ్గిస్తుంది.జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల వల్ల కలిగే జ్వరాన్ని తగ్గిస్తుంది.డోలో 650 యొక్క దుష్ప్రభావాలు:సాధారణ దుష్ప్రభావాలు: మైకము, మగత, వికారం, అజీర్ణం, అలర్జీ చర్మ ప్రతిచర్యలు.తీవ్రమైన దుష్ప్రభావాలు: కాలేయం, మూత్రపిండాల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలర్జీ ప్రతిచర్యలు (చర్మం ఎర్రబడటం, దురద, శ్వాస కష్టం).గమనిక: ఈ దుష్ప్రభావాలు అందరిలోనూ కనిపించకపోవచ్చు. కొంతమందికి తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు.జాగ్రత్తలు:డోలో 650 ను వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.నిర్దేశించిన మోతాదును మించి తీసుకోకూడదు.గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే తీసుకోవాలి.ఇతర మందులతో కలిపి తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.డోలో 650 ను దీర్ఘకాలం తీసుకోవడం వల్ల కాలేయానికి హాని కలిగించవచ్చు.ముఖ్యమైన విషయం: డోలో 650 ఒక నొప్పిని మాత్రమే నివారించగులుతుంది. ఇది వ్యాధికి చికిత్స చేయదు. నొప్పి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యునిని సంప్రదించడం చాలా ముఖ్యం.