దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా ఎన్నికలతో పాటు వడ్డీ రేట్లపై త్వరలో ఫెడ్ తన నిర్ణయాలను ప్రకటించనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
దీంతో సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే నిఫ్టీ 23,950 దిగువన ప్రారంభం కాగా.. సెన్సెక్స్ 260 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకొని మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.