పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో మంగళవారం సాయంత్రం ఫుడ్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఆహార ఆధారిత ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పండ్ల జ్యూస్, స్క్వాష్ ల తయారీ విధానం, పండ్లను నిల్వ ఉంచే పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.