ఐదు నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన వైయస్ఆర్‌సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. కూటమి నేతలకు ఎలా పాలించాలో తెలియక వైయస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఇవే ఈ ఐదు నెలల్లో జరిగాయన్నారు. కేంద్రంతో పొత్తులో ఉండి కూడా కేంద్రాన్ని నిధుల కోసం నిలదీయడం లేదు. ప్రతీకారంపై పెట్టిన దృష్టి పథకాల అమలుపై పెట్టడం లేదు. అప్పుల మీద పెట్టిన దృష్టి సంక్షేమంపై పెట్టలేదు. గతంలో అమ్మఒడి పథకంపై అనేక ఆరోపణలు చేశారు. కూటమి వచ్చాక ప్రతీ బిడ్డకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం తలకిందులైంది.
నాడు-నేడు పేరుతో వైయస్ జగన్ చేసిన పాఠశాలల అభివృద్ధిని మీరు కొనసాగిస్తారా లేదా? దీనికి సమాధానం చెప్పాలి’’ అంటూ పోతిన మహేష్ నిలదీశారు. గతంలో డిజిటల్ విద్యపై విద్యార్థులను ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు విద్యార్థులకు డిజిటల్ విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు?. పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం కూటమి వచ్చాక కుంటుపడింది. పేదలు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామంటే దానిపై 18 శాతం జీఎస్టీ వేస్తుంటే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?. రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం దారుణం. కూటమి వచ్చాకే మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు.’’ అని పోతిన మహేష్ మండిపడ్డారు.