ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇదేనా చంద్రబాబు పాలన ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 11:55 PM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైనందుకే సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతున్నారని, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోమంత్రి అనిత శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి.. కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసులు తమ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు జై కొట్టడం మానేసి, కూటమిలోని మూడు పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.


నియంతలైన హిట్లర్, గఢాపీ ఇద్దరూ కలసి కూర్చీలో కూర్చిని పాలిస్తే ఎలా ఉంటుందో.. చంద్రబాబు పాలన అలా ఉందన్నారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే సోషల్‌ మీడియా కార్యకర్తను తెలంగాణ నుంచి తీసుకొచ్చి 4 రోజులు చిలకలూరిపేట, ఒంగోలు, గుంటూరులలో తిప్పి చివరకు కోర్టులో హాజరు పర్చారని, పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని మాజీ మంత్రి రోజా ఆక్షేపించారు. పోలీసులు తనపై చేసిన దాడి, తగిలిన గాయాలను కన్నీళ్లు పెట్టుకుంటూ సుధారాణి జడ్జికి చూపించడంతో అంతా చలించిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ మీద, పవన్‌ కల్యాణ్‌ మీద టీడీపీ సోషల్‌ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెట్టినప్పుడు.. వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదని డిప్యూటీ సీఎంను రోజా ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com