శాసనసభ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి, శాసనసభ భేటీ అవుతాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనున నేపథ్యంలో సమావేశాల మొదటి రోజే 11వ తేదీన 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలో స్పీకర్ అయన్నపాత్రుడి అధ్యక్షతన జరిగే సభా వ్యవహారాల సలహా మండలి(బీఏసీ)లో నిర్ణయం తీసుకుంటారు. 11 రోజులపాటుజరిగే వీలుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు.