అమెరికా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం రాత్రి ఆయన ఇక్కడికి వ చ్చారు. కూటమి నేతలు, అభిమానులు విమానాశ్ర యానికి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. 15రోజుల పాటు అమెరికాలో ఆయన పర్యటించారు.
పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను, ఎన్నారైలను ఆయన కోరారు. గన్నవరం ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ వెళ్లారు. మాదల సాంబశివరావు, తుమ్మల లక్ష్మణరావు, గూడవల్లి నర్సయ్య, దొంతు చిన్న, గుజ్జర్లపూడి బాబూ రావు, ఆళ్ల గోపాలకృష్ణ, వై.పుల్లయ్యచౌదరి, గుత్తా శివరామకృష్ణ, శ్రీని వాసరావు, అశోక్‌కుమార్, గణేష్, యనమదల అజయ్, కొల్లా ఆనంద్ పాల్గొన్నారు.