కృష్ణా జిల్లా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల(పీహెచ్‌సీ)లో పనిచేసే వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలందించాలని, సమయపాలన పాటించాలని, నిబద్ధత, అంకితభావంతో విధులను నిర్వర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్‌వో)డాక్టర్ జి.గీతాబాయి సూచించారు. ఉంగుటూరు, ఇందు పల్లి పీహెచ్‌సీలను శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
ఇందుపల్లి, ఉంగుటూరు పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీచేశారు. రోగులపట్ల ప్రేమతో మెలగాలన్నారు. ఉంగుటూరు ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ నెల 14నుంచి ప్రారంభించనున్న క్యాన్సర్, ఆర్‌బీఎస్‌కే ఆరోగ్య స్ర్కీనింగ్ పరీక్షలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఉంగు టూరు, ఇందుపల్లి పీహెచ్‌సీ ల వైద్యాధికారులు కె.భవాని, కె.వాణి, బి.శిరీష, వీ వీ సుబ్బారావు పాల్గొన్నారు.