గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే రహదారిని బాగు చేయాలంటూ వెంట్రప్రగడ గ్రామస్థులు శనివారం ఆందోళన చేశారు. గత ప్రభుత్వంలో రోడ్డు వేయకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ-కంకిపాడు రోడ్డు కీలక రహదారి అని, దీని విస్తరణ కోసం ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు.
గోతులమయమై ప్రయాణానికి నరకంగా రహదారి మారిందని తెలిపారు. ఈ రోడ్డుపై జమిదింటకుర్రు గ్రామానికి చెందిన మహిళ పని ముగించుకుని నడుచుకుంటూ గ్రామానికి వెళ్తుంటే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించిందని, శుక్రవారం ఆర్టీసీ బస్సు వానపాముల గ్రామం దగ్గర అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిందని వెంట్రప్రగడ గ్రామస్థులు తెలిపారు. కూటమి ప్రభుత్వమైనా రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు.