కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. విజయవాడ దుర్గా ఘాట్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం నుంచి భవాని దీక్షలు ప్రారంభమవుతాయి. భవాని దీక్షల కోసం మల్లికార్జున మహా మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.