మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్త కమిషన్ లను అమరావతి నుంచి తరలింపు అంశంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ లను అమరావతిలోనే ఉంచుతామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా సంస్థలను అమరావతిలోనే కొనసాగించేందుకు వీలుగా చట్టసవరణ చేస్తామని పేర్కొంది. హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై మద్దిపాటి శైలజ అనే మహిళ, ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అనంతరం, తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది.