అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కూన రవి కుమార్ చర్చను మొదలుపెట్టారు. 2014లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. గత ప్రభుత్వం విధ్వంసంతో పాలనను ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రాన్ని దెబ్బతీసి అన్ని వ్యవస్ధలను నాశనం చేశారన్నారు.
2019-24 మధ్య కాలంలోని జగన్ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ వచ్చాక విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారని.. అలాగే నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును నిలిపేశారని... అమరావతిని కూడా నిలిపేశారని మండిపడ్డారు. ఏజెన్సీలు మార్చడం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందనని కూన రవి కుమార్ పేర్కొన్నారు.