సహకార సంఘాలలోని లోటుపాట్లను అధిగమించి సహకార సంస్థల బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని జెవిఆర్ నగర్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణంలో 71 వ అఖిలభారత సహకార సంఘాల వారోత్సవాలలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సహకార పతాకాన్ని ఆవిష్కరించి జిల్లాలో అఖిల భారత సహకార ప్రారంభోత్సవాలను ప్రారంభించారు.