వర్షాభావ ప్రభావంతో నష్టపోయిన రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. పలు జిల్లాల్లో 1.06లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని, ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామన్నారు. 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని, పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేశామన్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు. నష్టపోయిన వారికి రాయితీతో 47 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.