ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లకుపైగా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ చూసి ఢిల్లీ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ స్కూళ్లు మూసి వేయాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇవి కొనసాగుతాయన్నారు.ఢిల్లీలో దాదాపు 432 పాయింట్లకుపైగా వాయు కాలుష్యం పెరిగింది. 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-III'ని అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అలాగే ఢిల్లీ నగరంలోకి "బిఎస్-3" వాహనాలు, డీజిల్ వాహనాలు ప్రవేశ పై నిషేధం విధించింది. ఇక ఢిల్లీలోని రహదారులు, చెట్లపై నీళ్లు చల్లే వాహనాల సంఖ్యను పెంచింది.ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు ఢిల్లీ వాసులు. యమునా నది ఇంకా నురగలు కక్కుతూనే ఉంది. నదిలో నీరు ఇప్పటికే విషమంయగా మారిపోయాయి. అటు ముంబైలోనూ ఢిల్లీ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. AQI ఢిల్లీ స్థాయిలో లేకపోయినా క్రమంగా పెరుగుతున్న వాయుకాలుష్యంతో ఊపిరి ఆడని పరిస్థితి వస్తోంది. నెల రోజుల్లో శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రికి వెళ్తున్నవారి సంఖ్య 20 శాతం పెరిగింది.