కార్తీక పౌర్ణమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉసిరిచెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంభ దేవీకి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపి, ఉసిరి చెట్టుకు మహిళలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయంలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. భక్తులకు వేదపండితులు తీర్థప్రసాదాలు అందించారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను భక్తులు వెలిగించారు. శివునికి దీపారాధన జరిపితే పుణ్యం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు.