ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల లో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు.ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోందిఅదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 19 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 56,711 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 19,755 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.