ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సోషల్ మీడియాపై కేసుల పర్వాన్ని కొనసాగిస్తోంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాలారు మాట్లాడుతూ... తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనుదుర్రుకు చెందిన వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, న్యాయవాది గొర్రుముచ్చు సుందర్ కుమార్‌ను ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఇటీవలే అతనిని జిల్లా అధికార ప్రతినిధిగా వైయస్ఆర్సీపీ ప్రకటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సుందర్ కుమార్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది అని తెలిపారు. ఉండి పోలీస్ స్టేషన్లో సుందర్ కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు.