కర్నూలులోని హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు ఇలా ఇవన్నీ వైయస్ జగన్ ప్రభుత్వంలో కర్నూలులో ఏర్పాటు చేశారు అని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్.వి.మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నేషనల్ లా యూనివర్శిటీకి ఫౌండేషన్ వేశారు, కానీ ఇవన్నీ అమరావతికి తరలిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది, ఇది చాలా దుర్మార్గం.
రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది, ఈ చర్య వల్ల మరింత వెనకబడుతుంది, దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మేం కలెక్టర్‌ను కలిసి దీనిని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం అందజేశాం. ప్రభుత్వం వెనక్కితగ్గకపోతే న్యాయపరంగా, ప్రజా ఉద్యమాల ద్వారా ఎంత దూరమైనా వెళతాం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని పోతాం. శ్రీబాగ్ ఒడంబడికకు విరుద్దంగా ముందుకెళితే కూటమి పార్టీలు ద్రోహుల పార్టీలుగా మిగిలిపోతాయి, కూటమి నాయకులకు చెబుతున్నాం, రాయలసీమ ప్రజల పక్షాన పోరాటం చేయాలి, లేదా ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారు అని హెచ్చరించారు.