1953 నుంచి కర్నూలు నష్టపోయింది, శ్రీబాగ్ ఒడంబడికకు విరుద్దంగా కర్నూలుకు అన్యాయం చేస్తున్నారు అని కర్నూలు మేయర్ బీ.వై.రామయ్య ఆగ్రహం వ్యక్తపరిచారు. అయన మాట్లాడుతూ..... చంద్రబాబుకు రాయలసీమ అంటే ఎందుకంత ద్వేషం, నేషనల్ లా యూనివర్శిటీతో పాటు 43 రకాల కోర్టులు కర్నూలుకు రావాల్సి ఉంది, కానీ చంద్రబాబు వీటిని అడ్డుకున్నారు. రాయలసీమ ప్రాంత కూటమి నేతలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నారు, రాయలసీమ అభివృద్ది కాకుండా చంద్రబాబుకు లొంగిపోయారు. మేం అందరినీ కలుపుకుని ముందుకెళతాం, న్యాయసంస్ధల తరలింపును అడ్డుకుంటాం అని తెలియజేసారు.