ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నువ్వెవరకు నాకు చెప్పడానికి.. మండలిలో వైసీపీ సభ్యులకు హోం మంత్రి కౌంటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 07:16 PM

బుడమేరు వరదల ఆకస్మికంగా వచ్చాయని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ... విజయవాడలో వరదలు రావడం దురదృష్టకరమని.. అయితే, ఈ దురదృష్టంలోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆమె ప్రసంగానికి అడ్డుతగలడంతో ‘వినండి సార్.. చాలా ఉంది చెప్పడానికి.. అదృష్టమా? కాదా? అని దేశ ప్రజలు అనుకుంటున్నారు.. అన్నింటికీ నేను సమాధానం చెబుతాను’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు మాట్లాడొద్దని చెప్పడంతో అనిత ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక దశలో ఆమె సహనం కోల్పోయి.. నువ్వెవరు నాకు చెప్పడానికి అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com