ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. అలాగే, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024- 25 కొత్త క్రీడా పాలసీకి క్యాబినెట్లో ఆమోదం లభించింది.