ఝార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈరోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని, జేఎంఎం కూటమి సీట్లు భారీగా తగ్గే అవకాశముందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇతరులు 1 నుంచి 10 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి.
పీపుల్స్ పల్స్ - బీజేపీ కూటమి: 46 నుంచి 58, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 24 నుంచి 37
మ్యాట్రిజ్ - బీజేపీ కూటమి: 42 నుంచి 47, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 25 నుంచి 30
చాణక్య - బీజేపీ కూటమి: 45 నుంచి 50, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 35 నుంచి 38
టైమ్స్ నౌ-జేవీసీ - బీజేపీ కూటమి: 40 నుంచి 44, కాంగ్రెస్ (జేఎంఎం) కూటమి: 20 నుంచి 40