గూడూరు పట్టణంలో బుధవారం పోలీసు, పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది కలిసి ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ నుండి పాతబస్టాండు, ఆసుపత్రి రోడ్డు, ఐసిఎస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వారు ర్యాలీగా వెళ్ళి ట్రాఫిక్ కు అడ్డుగా ఉన్న వాహనాలు గుర్తించి చోదకులకు అవగాహన కలిగించారు. రహదారులపై వ్యాపారాలు చేసే వారిని గుర్తించి బండ్లు వంటివి వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండేలా చూడాలన్నారు.