ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించడానికి ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) “గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎల్‌ఐసీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. దరఖాస్తుల అర్హతలు, గడువు తేదీల వివరాలను తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
అర్హతలు: 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా సీజీపీఏ సాధించి ఉండాలి. 2024-25లో ఉన్నత విద్య (మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమో, వొకేషన్ కోర్సులు, ఐటీఐ) చదవడానికి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేయవచ్చు.