మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16,347 టీచర్ పోస్ట్ లు భర్తీ చేస్తానంటూ సీఎంగా తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు మరోసారి మెగా దగాకు సిద్దమయ్యారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని, ఆయన గత పాలనలోని చీకటి రోజులను పరిచయం చేస్తున్నారని ద్వజమెత్తారు. విద్యావాలంటీర్ల నియామకం ద్వారా టీచర్ పోస్ట్ ల భర్తీకి మంగళం పాడేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.