ఏపీ ప్రభుత్వం రేపు విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం (డిసెంబరు 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు విజయవాడలోని బందర్ రోడ్డుపై బస్సులు, ఆటోలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే ఆ మార్గంలో అనుమతిస్తామని చెప్పారు. అందరూ ఉదయం 8 గంటల లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమం దృష్ట్యా విజయవాడ ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.