భారతీయ అంబేద్కర్ సేన 13 వ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పీలేరు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వార్షికోత్సవ వేడుకలను బాస్ నాయకులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.