కాకినాడ వద్ద సముద్ర తీరానికి ఆలివ్ రిడ్లే తాబేళ్లు చనిపోయిన స్థితిలో కొట్టుకువస్తుండడం, కొన్ని తాబేళ్లు తీరంలో మృత్యువాత పడుతుండడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణాలపై విచారణ చేపట్టాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అరుదైన జాతికి చెందిన ఆ తాబేళ్ల మరణానికి కారణాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని పవన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. వన్యప్రాణుల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు