ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన సంవత్సరాది వేళ అమెరికాలో ఘటన

international |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 06:54 PM

నూతన సంవత్సరాది వేళ అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. న్యూ ఆర్లియన్స్ లోని ఫ్రెంచ్ క్వార్టర్ బౌర్బన్ స్ట్రీట్ లో ఈ ఘటన జరిగింది. నగర మేయర్ ఈ ఘటనను ఉగ్ర దాడిగా పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఓ వ్యక్తి పికప్ ట్రక్కును వేగంగా నడుపుకుంటూ వచ్చి ఒక్కసారిగా కిందికి దూకేశాడు. ఆ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్లింది. ట్రక్కు నుంచి దూకిన వ్యక్తి కాల్పులు ప్రారంభించాడు. అక్కడున్న పోలీసులు కూడా వెంటనే కాల్పులు జరిపారు. న్యూ ఆర్లియన్స్ లోని ఫ్రెంచ్ క్వార్టర్ ప్రఖ్యాత పర్యాటక స్థలంగా పేరుగాంచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com