ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం(88) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. 1936, నవంబరు 12న చెన్నైలో జన్మించిన ఆయన 1974, 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల్లో పాల్గొన్నారు. బార్క్, డైరెక్టర్‌గా, అణు కమిషన్ ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా పని చేశారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.