AP: బాపట్ల జిల్లా తూర్పు బజారులోని ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అలాగే తూ.గో. జిల్లా నల్లజర్లలోని ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంట్లో నిద్రిస్తునన్న దివ్యాంగుడు డానియల్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు. అతడిని రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోకింది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.