రైలు షెడ్యూల్‌లో మార్పు కారణంగా ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. దీంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. సుమారు 3 గంటలుగా రైలు అక్కడే నిలిచిపోయింది. జనవరి 1 నుంచి కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. గతంలో ఉదయం 6 గంటలకు వచ్చే రైలు 5 గంటలకే వచ్చింది. దీంతో కినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో పలువురు ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. వారిని మరో రైలులో రాజమండ్రి తరలించారు.