రంపచోడవరం మండలంలోని సీతపల్లి జంక్షన్ వద్ద సోమవారం లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మోటార్ సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టడంతో అతని తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడని సీతపల్లి గ్రామస్థులు తెలిపారు. రంపచోడవరం సీఐ రవికుమార్ ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.