ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2025 సంవత్సరంలో తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధిలోని నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు. రూ. 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు. దీని ద్వారా 1,600 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 31 వరకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 124.16 కోట్లు విడుదల చేసింది. మొత్తం 9,123 మంది లబ్ధి పొందారు.