ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబును శుక్రవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించనున్నారు. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రఘురామ గుండెలపై తులసిబాబు కూర్చొని టార్చర్ చేశాడని ఆరోపణ నేపథ్యంలో అతనిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. అయితే తులసిబాబును గుర్తించేందుకు విచారణకు హాజరౌతానని ఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ దామోదర్, తులసిబాబుకు నోటీసులు జారీ చేశారు.