ఆర్థిక సమస్యల కారణంగా పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తోంది. "తల్లికి వందనం" పథకం కింద రూ.15 వేలు ఇవ్వాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన" పథకం కింద ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు భోజనం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలును విస్తృతం చేసేందుకు చంద్రబాబు సర్కార్ తీర్మానం చేసింది. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో జీవో ఎంఎస్ నెంబర్ 40ను ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గతేడాది డిసెంబర్ 31 జారీ చేశారు.