సీఎం చంద్రబాబు, మంత్రులతో ముఖ్య అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జగన్ 21వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్ నిధులు మళ్లించాడని.. ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై చర్చ జరిపారు. జగన్ ఉద్యోగులకు చేసిన నష్టం భర్తీకి ప్రత్యామ్నాయం చూసి వారికి న్యాయం చేయాలని సీఎం సూచించారు. ఆర్ధిక వెసులుబాటు బట్టి ఒక్కో ఎన్నిక హామీ అమలు చేసుకెల్దామన్నారు సీఎం. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఫించన్ పెంపు, అన్న కాంటీన్లు పునరుద్ధరణ, దీపం పథకం అమలు, మెగా డీఎస్సీ ప్రకటన చేశామని తెలిపారు. కొత్త ఏడాది ఆర్ధిక వెసులుబాటు బట్టి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలు ఒక్కొక్కటీ ప్రారంభిద్దామని మంత్రులతో చంద్రబాబు అన్నారు. కళాశాలలకు ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఎక్కడా విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకుండా కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ భారం విద్యార్థులపై లేకుండా కళాశాలలకు దశల వారీ చెల్లింపులు చేస్తూ విద్యాసంస్థలు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.