పేర్ని జయసుధ మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయమైన కేసులో విచారణకు రావాలని జయసుధకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.మాజీ మంత్రి పేర్ని నాని భార్య యసుధకు చెందిన గోడౌన్ లో పీడీఎస్ బియ్యం మాయమైంది. అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు. మొత్తం 387 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు గాను ఇంకా రూ. 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు.