జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) ఏదిచేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషను పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. పాట్నాలోని గాంధీ.
మైదాన్‌లో మహాత్ముడి విగ్రహం వద్ద విద్యార్థులకు మద్దతుగా ఈయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే దీక్షాశిబిరం పక్కన పీకే కోసం రూ.కోట్ల ఓ లగ్జరీ వ్యాను ఉండటంపై రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.