ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే సమాచారం అందించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లకు సోమవారం అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాయి. మరోవైపు పింఛన్లను కూడా డిసెంబర్ 31నే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే.